ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ‘. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాల పై తెలుగులో రిలీజ్ అవుతుంది. మూవీ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా కబ్జ మూవీ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత లక్ష్మీ కాంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘తెలుగులో నేను, సుధాకర్ రెడ్డి గారు కలిసి కబ్జ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ చంద్రు గారు హక్కులను మాకు ఇచ్చే విషయంలో మాకెంతో సపోర్ట్ చేశారు. డెఫనెట్‌గా మార్చి 17న మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ‘కబ్జ’ సినిమా కబ్జా చేయటానికి వస్తుంది. కె.జి.యఫ్, కాంతార సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు కబ్జతో ఆ ప్లేస్‌ను కబ్జ చేయబోతున్నామని ఘంటా పథంగా చెబుతున్నాను. ఉపేంద్ర గారి బుద్ధి మంతుడు మూవీని కూడా తెలుగులో నేనే చేశాను. ఇప్పుడు ‘కబ్జ’ మూవీ చేస్తున్నాను. మళ్లీ ఉపేంద్ర గారితో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు.
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ…‘‘ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకే ఇదెంతో స్పెషల్. ఎందుకనో మనకు తెలుసు. గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఆయన చేసిన నాటు నాటు పాట ఇండియాలోనే కాదు.. వరల్డ్‌లోనే సెన్సేషన్ అయ్యింది. ఆర్ఆర్ఆర్‌లో తారక్, రామ్ చరణ్ గారు డ్యాన్స్ చేసినప్పుడు ఇండియా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు ప్రపంచమే డ్యాన్స్ చేస్తుంది. ఆస్కార్ దొరికింది. ఒక హిస్టరీ క్రియేట్ అయ్యింది. వారికి నా అభినందనలు.
కబ్జ సినిమా విషయానికి వస్తే .. విజువల్ గ్రాండియర్ మూవీ ఇది. రెండు, మూడేళ్లుగా ఈ సినిమా చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా ఆర్.చంద్రు గారికి దక్కుతుంది. ఆయన కల ఈ సినిమా. రెండు, మూడు సార్లు కరోనా వేవ్స్ వచ్చాయి. చాలా సమస్యలు ఏర్పడినప్పటికీ ఇలాగే నేను సినిమా చేయాలని చంద్రు డిసైడ్ అయ్యి ‘కబ్జ’ సినిమ చేశారు. ఆయనకు సపోర్ట్‌గా కెమెరామెన్ ఎ.జె, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా వర్క్ చేయటంతో ‘కబ్జ’ మూవీ అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌చేస్తున్నారు. అందరూ ఉపేంద్ర సినిమాను మరచిపోలేరు. అలాంటి సినిమా కావాలని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే యుఐ సినిమాతో ఇక్కడకి మళ్లీ వస్తాను. అందులో నేనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాను’’ అన్నారు.
Also Read : అంచనాలు పెంచేసిన కబ్జ ట్రైలర్