Friday, October 18, 2024
Homeసినిమాపుష్ప 2 కోసం రంగంలోకి మ‌రో డైరెక్ట‌ర్

పుష్ప 2 కోసం రంగంలోకి మ‌రో డైరెక్ట‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. బాలీవుడ్ లోనూ సంచ‌ల‌నం సృష్టించి  వంద కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసి టాక్ అఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.  అంతే కాకుండా సాంగ్స్,  బన్నీ మేనరిజమ్, డైలాగ్స్  కూడా ఓ రేంజ్ లో వైరల్ కావడం విశేషం.

ఇప్పుడు పుష్ప‌ పార్ట్ 2 ని మరింత స్పెషల్ గా తీర్చిదిద్దాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట. ఇందు కోసం క‌థలో భారీ మార్పులు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫాహిద్ ఫాజిల్ విల‌న్ గా న‌టిస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో సెట్స్ పైకి రానుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది.

అది ఏంటంటే.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జ‌రుగుతుంది. అయితే.. ఈ చర్చల్లో దర్శకుడు ఉప్పెన బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ లో జీనియస్ అయిన సుకుమార్ కు తను కూడా కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నాడట. ఇది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మ‌రి.. పుష్ప 2 ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

Also Read బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా పుష్ప‌ : నిర్మాతలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్