Saturday, November 23, 2024
HomeTrending Newsఉత్తరప్రదేశ్ ఎన్నికలు.. పార్టీల ఎత్తుగడలు

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు.. పార్టీల ఎత్తుగడలు

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్ని కొన్ని రోజులుగా వస్తున్న ఉహాగానాల్ని కొట్టిపారేస్తూ ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. మొదటి దశ ఎన్నికలు జరగనున్న 11 జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు మొదటి లిస్టు విడుదల చేసింది. బిఎస్పి అధినేత్రి మాయావతి ఈ రోజు 53 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. మరో ఐదు మంది అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మొదటి దశలో 58 శాసనసభ స్థానాలకు వచ్చే నెల పదవ తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే ఈ దఫా ఎన్నికల్లో బిఎస్పి అధికారంలోకి వచ్చితీరుతుందని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బిఎస్పి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని సమీక్ష చేస్తామని ప్రకటించారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మొదటి దశ ఎన్నికల్లో ముస్లీంల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. మొరదాబాద్ పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ఖురేషి సరికొత్త హామీ ఇస్తున్నారు. తనను గెలిపిస్తే జిల్లా వ్యాప్తంగా ఆధునికంగా కొత్త కబేళాలు నిర్మిస్తానని వాగ్ధానం చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తానని చెపుతున్నారు.

మరోవైపు మెజారిటీ హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి తెరవెనుక మంత్రాంగం చేస్తోంది. అందులో భాగంగా అయోధ్య రామాలయం నిర్మాణం పనుల వివరాలను ట్రస్టు వెల్లడించింది. ఈ నెలాకరు వరకు అయోధ్య రామాలయం రెండో దశ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని రాం జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ రోజు వెల్లడించారు. రామ మందిర నిర్మాణానికి చెందిన ౩ డీ వీడియో ఒకటి ఇటీవల (గురువారం) రామ జన్మ భూమి ట్రస్ట్ రిలీజ్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో జరుపుకునే భోగి( Bhogi)పండగ.. ఉత్తరాదివారు లోహ్రి (Lohri)గా జరుపుకుంటారు. లోహ్రి పండగ సందర్భంగా రామయ్య మందరి నిర్మాణం జరుగుతున్న తీరుపై అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రక్రియను వివరంగా వివరించే 3డి యానిమేషన్ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్