Saturday, January 18, 2025
HomeTrending Newsనిలకడగా వంశీ ఆరోగ్యం

నిలకడగా వంశీ ఆరోగ్యం

Vamshi:  వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మొహాలీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.  మొహాలీ లోని ఐఎస్బీలో మూడో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు గన్నవరం శాసన సభ్యుడు వంశీ అక్కడకు వెళ్ళారు. నిన్న క్లాసులో ఉండగా ఎడమచేయి లాగుతున్నట్లు అనిపించడంతో  స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్యులు వంశీకి ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు నిర్వహంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్