Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్‌, విజ‌య్ కాంబినేష‌న్లో మూవీ నిజ‌మేనా?

మ‌హేష్‌, విజ‌య్ కాంబినేష‌న్లో మూవీ నిజ‌మేనా?

Two SuperStars: ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తోంది. ‘ సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’  ఈ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ మూవీతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలకు మరింత ఊపు వ‌చ్చింద‌ని చెప్ప‌చ్చు. అయితే.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కోలీవుడ్ స్టార్ విజ‌య్ కాంబినేష‌న్లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిజంగానే ఈ భారీ, క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఉందా అనేది ఆస‌క్తిగా మారింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కోలీవుడ్ స్టార్ విజ‌య్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.  2023 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, మ‌హేష్ బాబు మ‌ధ్య మంచి అనుబంధం ఉంది.

అందుచేత మ‌హేష్‌, విజ‌య్ కాంబినేష‌న్లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని వంశీ పైడిప‌ల్లి ప్లాన్ చేస్తున్నాడ‌ని.. ఈ మూవీ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని టాలీవుడ్ లో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హేష్ బాబు కూడా విజ‌య్ తో క‌లిసి న‌టించేందుకు ఇంట్ర‌స్ట్ గా ఉన్నాడ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. విజ‌య్ తో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తోన్న మూవీలో మ‌హేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నాడ‌ట‌. ఈ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్