Vanama Raghava Suspension :
టీఆర్ ఎస్ పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్ చేస్తు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుంది.
ఎమ్మెల్యే కుమారిడి నిర్వాకంతో పార్టీ పలుచంయ్యే ప్రమాదం ఉన్నదున గులాబి నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాల్వంచలో రామకృష్ణ ఆత్మహత్య కేసులు వనమా రాఘవ ప్రధాన నిందుతుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉండగా ఎనిమిది పోలీసులు బృందాలు రాఘవ కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. తన కుమారుడు రాఘవ అరెస్టుకు సహకరిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగిన ప్రజా సంఘాలు వనమా వెంకటేశ్వర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ, రాఘవకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశాయి.