Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్యకు జంటగా వరలక్ష్మి శరత్ కుమార్

బాలయ్యకు జంటగా వరలక్ష్మి శరత్ కుమార్

నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ  చిత్రం అభిమానులకు, మాస్ ఆడియన్స్ కి విశేషంగా నచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆహాలోని అన్ స్టాపబుల్ టాక్ షోలో వీరసింహారెడ్డి టీమ్ పాల్గొంది. ఈ టాక్ షోలో వరలక్ష్మీ శరత్ కుమార్, గోపీచంద్ మలినేని పాల్గొన్నారు.

ఈ టాక్ షోలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ  “బాలకృష్ణ గారికి కొంచెం కోపం ఎక్కువని నేను విన్నాను. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన నా కంటే హైపర్ అనే విషయం అర్థమైంది. ఆయనకి కోపం వస్తుంది. అది కూడా డిసిప్లిన్ విషయంలో… మిగతా సమయాల్లో ఆయన చాలా సరదాగా ఉంటారు” అని అన్నారు.

ఇక బాలయ్య మాట్లాడుతూ .. “వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి చాలా గొప్పగా నటించింది. నాయకురాలు నాగమ్మ తరహా పాత్రలను చేసే ఒక నటి తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. వరలక్ష్మి మల్టీ టాలెంటెడ్. హీరోయిన్ గా.. చిన్నపిల్లలా అనిపిస్తూ ఉంటుంది. మేమిద్దరం కలిసి హీరో, హీరోయిన్లుగా నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను” అన్నారు. ఆ మాటకి వరలక్ష్మి శరత్ కుమార్ ఆనందంతో పొంగిపోయింది. తన సీట్లో నుంచి లేచొచ్చి ఆయనకి హైఫై ఇచ్చింది. ఈ సినిమాలో నాకు విలన్ రోల్ ఇచ్చినందుకు నేను గోపీచంద్ మలినేని పై నా కోపం చూపిస్తూనే ఉన్నాను సార్ అంటూ ఆయనతో హీరోయిన్ గా చేయడానికి తాను రెడీ అనే విషయాన్ని ఈ విధంగా బయటపెట్టింది. మరి.. భవిష్యత్ లో బాలయ్య, వరలక్ష్మీ శరత్ కుమార్ కాంబో మూవీని ఎవరైనా సెట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్