Monday, February 24, 2025
Homeసినిమా19న వరుణ్ తేజ్ 13వ చిత్రం ప్రారంభం

19న వరుణ్ తేజ్ 13వ చిత్రం ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలతో విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తున్న వరుణ్ తేజ్  కొత్త సినిమపై ఓ ఆసక్తికర వీడియో విడుదల చేశారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త సినిమా స్నీక్ పీక్ వీడియోలో వరుణ్ చాలా క్యురియాసిటీతో స్క్రిప్ట్‌ను చదవడం ఎక్సయిటింగా వుంది. ఈ వీడియోలో కనిపించిన కొటేషన్ హీరో పాత్ర గురించి తెలియజేస్తోంది.

స్క్రిప్ట్ చదవడం పూర్తి కాగానే, స్క్రిప్ట్‌ తనకి గొప్ప సంతృప్తిని ఇచ్చినట్లు వరుణ్ తేజ్ ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది. వీడియో చివర్లో స్క్రిప్ట్‌పై ఒక బొమ్మ ఎయిర్‌క్రాఫ్ట్‌ని వుంచడం, విమానం టేకాఫ్ అవుతున్నట్లు వినిపించిన సౌండ్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. వీడియో చూపించినట్లు యధార్ధ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ కథ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చాలా విలక్షణంగా వుంది. ఈ మెగా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయ‌నున్నారు మేక‌ర్స్.

Also Read: ఆహాలో వరుణ్ తేజ్‌ ‘గని’ రిలీజ్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్