వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెగా ప్రిన్స్ గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం ‘గని’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీలు బ్యానర్స్ పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి ‘గని’ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ గారు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. రీసెంట్గా ఆయన లుక్, ఎక్సర్సైజ్ ప్రోమోలకు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్బంగా మా `గని` సినిమాను భారీ రేంజ్లో విడుదల చేస్తాం“ అన్నారు.
బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.