Friday, June 12, 2026
HomeTrending Newsకెసిఆర్ దార్శనికత కలిగిన నేత - తిరుమావళవన్

కెసిఆర్ దార్శనికత కలిగిన నేత – తిరుమావళవన్

దళిత బంధు రైతు బంధు ఈ రెండు స్కీం లు కూడా విప్లవాత్మకమైన పథకాలని  విసికె అధినేత తిరుమావళవన్ అన్నారు. సిఎం కెసిఆర్  బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారన్నారు. తమిళ నాడు నుంచి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె)పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్., వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం.,బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈ రోజు జరిగిన తెరాస సర్వ సభ్య సమావేశంలో విసికె అధినేత తిరుమావళవన్  పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత రాష్ట్ర సమితిగా మార్చటం హర్షనీయమని కెసిఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా తిరుమావలన్ మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు.

విసికె అధినేత తిరుమావళవన్ ప్రసంగం..ముఖ్యాంశాలు :

బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ కి శుభాకాంక్షలు.మీరు నన్ను ఆహ్వానించడం నాకో గొప్ప గౌరవం. ఇది నాకు ప్రత్యేకమైన మరిచిపోలేని రోజు. టిఆర్ఎస్ ., బిఆర్ఎస్ గా మారింది. ఇది కేవలం పేరు మార్పు కాదు., టి’ నుంచి బి’ కి జరిగే పరిణామ క్రమం. టి‘ అంటే టార్చ్. బి’ అంటే బ్రైట్.మీకు అధ్భుతమైన భవిష్యత్తు వున్నది.
మన నాయకుడు (కెసిఆర్) పూర్తిగా ప్రత్యేకతలు కలిగిన నాయకుడు. తన ఆలోచనలు, పని విధానం, పోరాటాలు, విజయాలు, అన్నీ కూడా దేనికవే ప్రత్యేకతను కలిగివున్నయే. అతను తెలంగాణ ప్రజలకోసం వో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు భారత దేశ ప్రజల కోసం సాధించేందుకు ముందడుగు వేస్తున్నారు. విసికే పార్టీ తరఫున మా శుభాభినందనలు తెలుపుతున్నాము. మీరు ఈ దేశానికి వొక రోల్ మోడల్. ఈ దేశంలో మరే ముఖ్యమంత్రి కూడా దళితుల కోసం గిరిజనుల కోసం రైతుల కోసం ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదు.

దళితులు రైతులు గిరిజనులే మిమ్మల్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు. సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడు. పార్టీ పేరును మార్పు  చేయడం అనే నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న సమయ స్పూర్తితో కూడిన, తెలివైన, స్కాలర్లీ నిర్ణయం. సిఎం కెసిఆర్ తెలంగాణను సాధించినట్టే భారత దేశ అభివృద్ధిని కూడా సాధించాలని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.
ఈ సందర్భంగా వారి పార్టీ తరఫున సందేశాన్నివారు చదివారు. ‘‘ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సాధికారతకోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం గొప్ప విషయం అందుకు అభినందనలు. ఇదే స్పూర్తితో భారత పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాము. తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సిఎంకి కృతజ్జతలు. రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, విప్లవాత్మక కార్యాచరణతో కూడిన పథకాలను సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. అందుకు మీకు కృతజ్జతలు తెలుపుతున్నాము.
నిజంగా సిఎం కెసిఆర్ దార్శనికత కలిగిన నాయకుడు. రానున్న కాలంలో బిజెపి వోటమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి. మత విధ్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో విచ్చిన్నత కు కారణమౌతున్న బిజెపి విభజన రాజకీయాలను తిప్పికొట్టాలి. అందుకు అందరం కలిసి పని చేద్దాం.

Also Read : తెరాస సమావేశానికి జెడిఎస్ నేత కుమారస్వామి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular