Sunday, January 19, 2025
Homeసినిమా'వీరసింహారెడ్డి' సెన్సార్ టాక్ ఏంటి..?

‘వీరసింహారెడ్డి’ సెన్సార్ టాక్ ఏంటి..?

బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శృతి హాసన్ నటించింది. ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేశాయి. దీంతో బాలయ్య అభిమానులు మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. జనవరి 12న వీరసింహారెడ్డి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతుంది.

మరి.. వీరసింహారెడ్డి సెన్సార్ టాక్ ఏంటంటే.. ఒక విధంగా బాలయ్య వీర విహారమే అంటున్నారు. సీనియర్ బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా రూపొందట. ఈ పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంటుందన్నది సెన్సారు టాక్. అలాగే బాలయ్య పాత్రకు-వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు మధ్య వచ్చే సీన్ లు అన్నీ ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఫస్టాఫ్ లో దాదాపు 20 నిమషాలకు పైగా హై ఇచ్చే సన్నివేశాలు వున్నాయట. సెకండాఫ్ మాత్రం పాటలు, ఫైట్లతో కాస్త టైట్ ప్యాక్ అయిందని అంటున్నారు.

పవర్ ఫుల్ డైలాగులు జనాలు పొలిటికల్ గా కనెక్ట్ చేసుకుంటారని, ఈలలు, తప్పట్లు వినిపిస్తాయని అంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి బాలయ్య ఓ పవర్ ఫుల్ సినిమా అందిస్తున్నారు అన్నది సెన్సారు టాక్. ఈ టాక్ బయటకు వచ్చిన తర్వాత అభిమానులు మరింత ఆసక్తిగా వీరసింహారెడ్డి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. మరి.. అఖండ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్