Saturday, January 18, 2025
HomeసినిమాSaindhav Shooting Sri Lanka: శ్రీలంకలో వెంకటేష్ 'సైంధవ్'

Saindhav Shooting Sri Lanka: శ్రీలంకలో వెంకటేష్ ‘సైంధవ్’

వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ శైలేష్ కొలను దర్శకత్వంలో షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. సినిమా కొత్త, కీలక షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో టాకీ భాగం, ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ఒక పాట కోసం కొన్ని మాంటేజ్‌లను చిత్రీకరిస్తోంది. వెంకటేష్‌తో పాటు సినిమాలోని ప్రముఖ నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ వెంకటేష్, నవాజుద్దీన్ సిద్దికీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ క్యారెక్టర్ పోస్టర్లను ఇదివరకే విడుదల చేశారు. ఈ సినిమా కథ పూర్తిగా ఈ 8 పాత్రల చుట్టూనే తిరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్