Go Ahead: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా చేశారు. ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్నారు. లూసీఫర్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాతో పాటు చిరంజీవి బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య, మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు ఛలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుములతో కూడా సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించనున్నారు.
అయితే.. ఈమధ్య దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ చిరంజీవికి నచ్చలేదని.. అందుకనే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై డైరెక్టర్ వెంకీ కుడుముల కానీ.. నిర్మాత దానయ్య కానీ.. స్పందించలేదు. దీంతో ఇది నిజమే అనుకున్నారు. ఇదిలా ఉంటే.. విక్రమ్ సినిమా విడుదల సందర్భంగా కమల్ హాసన్ ని వెంకీ కుడుముల ఇంటర్ వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూలో తను చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నట్టుగా కమల్ కి చెప్పారు. ఈ విధంగా దర్శకుడు వెంకీ కుడుముల చిరుతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని.. చెప్పి పుకార్లకు చెక్ పెట్టారు. అదీ.. సంగతి.
Also Read : చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ఫిక్స్?