Sunday, January 19, 2025
Homeసినిమాబ‌న్నీ ప్రాజెక్ట్ రామ్ తో ప్లాన్ చేస్తున్నారా?

బ‌న్నీ ప్రాజెక్ట్ రామ్ తో ప్లాన్ చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ కాంబినేష‌న్లో, దిల్ రాజు నిర్మాతగా  ఐకాన్ అనే  చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లలేదు.అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. పుష్ప సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో బ‌న్నీ ఫుల్ బిజీ అయ్యాడు. ఐకాన్ ఊసే లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. బ‌న్నీతో లాభం లేద‌నుకుని వేణు శ్రీరామ్, ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఇద్దరూ కలిసి మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ కథలో హీరో పాత్రకిగల ఎనర్జీకి రామ్ అయితే బాగుంటుందని భావించి ఆయనకి కథ చెప్పారట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మార్పులు రామ్ చెప్పడంతో, అందుకు తగినట్టుగా చేయడానికి ఇద్దరూ ఓకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఆ మార్పులను చేసే పనిలో ఉన్నాడని స‌మాచారం.

టైటిల్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామ్ త్వరలో బోయపాటితో పాన్ ఇండియా మూవీ చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఆ సినిమా షూటింగు పూర్తయిన తరువాత దిల్ రాజు ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. మ‌రి.. ఈసారైనా వేణుశ్రీరామ్ ఐకాన్ సెట్స్ పైకి వ‌స్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్