భారత హాకీ జట్టు మాజీ ప్లేయర్ వరిందర్ సింగ్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.1970 దశకంలో ఇండియా హాకీ సాధించిన ఎన్నో విజయాల్లో అయన కీలక పాత్ర పోషించారు. 1975లో మలేషియా లోని కౌలాలంపూర్ లో జరిగిన వరల్డ్ కప్ హాకీ జట్టులో సభ్యుడు. ఇది ఇండియా ఇప్పటివరకో సాధించిన ఏకైక వరల్డ్ కప్ టైటిల్ కావడం గమనార్హం, నాడు ఫైనల్లో దాయాది పాకిస్తాన్ ను 2-1 తేడాతో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది, ఆ టీమ్ లో వరీందర్ కూడా ఉన్నారు. అంతకుముందు 1972లో జరిగిన మునిచ్ ఒలింపిక్స్ లోను, 1973జరిగిన వరల్డ్ కప్ లో కూడా ఆడారు. 2007 lo కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ధ్యాన్ చాంద్ అవార్డుతో సత్కరించింది.
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తో పాటు హాకీ ఇండియా, హాకీ ఆటగాళ్ళు పలువురు వరీందర్ మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు.