Tuesday, February 25, 2025
HomeTrending Newsఆధునిక సౌకర్యాలతో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్

ఆధునిక సౌకర్యాలతో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్

PV వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. రాష్ట్రంలో జీవాల సంఖ్యకు అనుగుణంగా పశువైద్యులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని PV నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా 12.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో మెడిసిన్, గైనకాలజీ, డయాగ్న సిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఎండో స్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులో కి తీసుకోస్తామని మంత్రి ప్రకటించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం ఆకర్షించే విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వంకు దక్కుతుందని మంత్రి అన్నారు. త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్, నల్లగొండ లలో నూతన వెటర్నరీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి తలసాని తెలిపారు.

Also Read : సీడ్ బాల్స్ తో గత రికార్డు తిరగరాస్తాం – శ్రీనివాస్ గౌడ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్