Sunday, January 19, 2025
Homeసినిమావెంకీ చేతుల మీదుగా రజిని టీజర్

వెంకీ చేతుల మీదుగా రజిని టీజర్

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్ద‌న్న’ పేరుతో రాబోతుంది. తెలుగు హక్కులను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి అందిస్తున్నారు. ‘పెద్ద‌న్న’ టీజ‌ర్‌ను ఈ రోజు (అక్టోబర్ 23) విక్టరీ వెంకటేష్ విడుద‌ల‌ చేశారు.

ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇందులో మాస్ ప్రేక్షకులకు వాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో  వచ్చిన టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది.
శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్‌ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్