విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన లైగర్ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. నష్టాలు రావడంతో తమను ఆదుకోవాలని ఎగ్జిబిటర్స్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీనుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై పూరి జగన్నాథ్ హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. పూరి ఇంటి ముందు ధర్నా చేస్తామని మెసేజ్ పంపించడంతో ఈ అంశం వివాదస్పదం అయ్యింది.
ఆదుకుంటానని.. కొంత అమౌంట్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ గతంలో ఓ వాయిస్ మెసేజ్ ను పూరి విడుదల చేశారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర లైగర్ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేస్తుండడంతో అసలు ఏం జరగనుందినేది ఆసక్తిగా మారింది. త్వరలో రామ్ తో పూరి సినిమా చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు.
‘ఆచార్య’ ఫ్లాప్ అయితే చిరంజీవి, రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చారు. అలా విజయ్ దేవరకొండ కూడా రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాలనే మాట వినిపిస్తుంది. ఆచార్య సినిమాకు చరణ్ కూడా ఓ నిర్మాత. అందుచేత వాళ్లు రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చారంటే అర్థం ఉంది కానీ.. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు నిర్మాత కాదు. లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదు. పైగా ఆయనకు ఇస్తామని చెప్పిన రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. అందుచేత రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాలనడం కరెక్ట్ కాదంటున్నారు విజయ్ సన్నిహితులు. మరి.. ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.