Monday, January 20, 2025
Homeసినిమాషణ్ముక ప్రియకు విజయ్ దేవరకొండ విషెస్

షణ్ముక ప్రియకు విజయ్ దేవరకొండ విషెస్

నేడు జరగబోయే పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘‘ఇండియన్ ఐడల్ 2021’’ గ్రాండ్ ఫినాలే లో ఫైనలిస్ట్ గా పోటీ చేస్తున్న తెలుగమ్మాయి షణ్ముక ప్రియ కు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్ ప్రైజ్ చేశాడు. ఇండియన్ ఐడల్ షోలో ఓ తెలుగమ్మాయి ఫైనల్ చేరుకోవడం ఇదే మొదటిసారి. తను ‘‘విజయ్ దేవరకొండ కు పెద్ద ఫ్యాన్ అనీ, విజయ్ సినిమాలో పాడటమే తన కోరిక అని ఇంతకు ముందు షో నిర్వాహకులకు తెలిపింది. అందుకే సోనీ టీవి వాళ్లు విజయ్ ను షణ్ముక కు విషెస్ తెలపాలని కోరారు.

వెంటనే విజయ్ దేవరకొండ ఓ వీడియోతో ప్రోగ్రామ్ జరగుతున్నప్పుడే షణ్ముక ప్రియను సర్ ప్రైజ్ చేశాడు.తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా, టైటిల్ గెలిచినా, గెలవకపోయినా.. తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వీడియో చూడగానే షణ్ముక ప్రియ, వాళ్ల పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. షోలో ఉన్న కంటెస్టెంట్ లు, గెస్ట్ లు, ప్రేక్షకులు అంతా షణ్ముక కు విజయ్ ఆఫర్ ఇవ్వటాన్ని అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్