Sunday, January 19, 2025
HomeసినిమాVidudala: కంటెంట్ తో అంచనాలు పెంచుతున్న 'విడుదల' 

Vidudala: కంటెంట్ తో అంచనాలు పెంచుతున్న ‘విడుదల’ 

ఈ నెల 14వ తేదీన ‘శాకుంతలం’ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో .. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమాను బరిలోకి దింపడం లేదు. అయితే తమిళ అనువాదంగా లారెన్స్ ‘రుద్రుడు’ రానుంది. ఇక్కడ లారెన్స్  సినిమాలకి ఉన్న క్రేజ్ ను బట్టి చూసుకుంటే, ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇక ఆ మరుసటి రోజునే ‘విడుదల’ సినిమా థియేటర్లకు రానుంది. మార్చి 31వ తేదీన తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబడుతోంది. అలాంటి ఈ సినిమాను అల్లు అరవింద్ ఈ నెల 15వ తేదీన ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇంతవరకూ తమిళ సినిమాల్లో స్టార్ కమెడియన్ సూరికి క్రేజ్ ఉంది. ఇక్కడి ప్రేక్షకులకు ఆయన పరిచయమేగానీ, ఆయన పేరు ‘సూరి’ అనే విషయం చాలామందికి తెలియదు. ఆయనే ‘విడుదల’ సినిమాలో హీరో.

ఇక తమిళంలో స్టార్ డైరెక్టర్ గా వెట్రి మారన్ కి చాలా పెద్ద పేరు ఉంది. అయితే ఆయన చాలా సింపుల్ గా ఉండటం వలన .. పబ్లిసిటీకి దూరంగా ఉండటం వలన తెలుగు ప్రేక్షకులు ఆయనను చూసింది కూడా తక్కువ. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే అల్లు అరవింద్ ఆయనను వేదికపై పరిచయం చేశారు. ఆయన సినిమా కదా .. గొప్పగానే ఉండొచ్చునని థియేటర్స్ కి వెళ్లేవారు ఇక్కడ చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే ఆశలన్నీ విజయ్ సేతుపతి పెట్టుకున్నారని అనుకున్నారు.

ఇక్కడి ప్రేక్షకులకు విజయ్ సేతుపతి బాగానే తెలుసు. ఆయన భిమానులు ఇక్కడ కూడా ఉన్నారు.  ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన విజయ్ సేతుపతి మాత్రమే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించవలసి ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ట్రైలర్ వదిలిన తరువాత .. మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన తరువాత అందరిలో ఆసక్తి పెరిగింది. కంటెంట్ పరంగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిగాయి. చూస్తుంటే ఇక్కడ కూడా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసేలా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్