విశాఖలో 70 నుంచి 75 శాతం భూములు ఒకే సామాజిక వర్గం చేతుల్లో ఉన్నాయని, దసపల్లా భూములపై నిర్ణయం తీసుకోకపోవడం చంద్రబాబు వైఫల్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడే దసపల్లా భూములు 22(ఏ)నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ విషయమై ఇప్పటికే బిల్డర్లు చెప్పారని అయన స్పష్టం చేశారు. దసపల్లా భూముల్లో 64 ప్లాట్‌లలో 55 ప్లాట్‌లు చంద్రబాబు సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయని, ప్రభుత్వ చర్యతో 400 కుటుంబాలకు మేలు జరిగిందని వివరించారు. కొన్ని పత్రికలు వార్తలను కులం అనే పచ్చ ఇంకుతో రాస్తున్నాయని, విషపు రాతలు రాసే మీడియాకు వైసీపీ ఏమి చేసినా తప్పుగానే కనిపిస్తుందని విమర్శించారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను అడ్డుకోవడం, అమరావతి భూములతో లక్షల కోట్లు సంపాదించాలనే కుట్రలో భాగమే ఇలాంటి రాతలకు పాల్పడుతున్నారన్నారు.
తనకు విశాఖలో ఒకటే ఒక ఫ్లాట్ ఉందని, అంతకు మించి ఆస్తులు లేవని, నా కుమార్తె అత్తింటి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపార రంగంలో వున్నారని, తన వియ్యంకుడి కుటుంబం ఆస్తులు కొనుగోలు చేస్తే తనకేమి సంబంధమని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని ఘాటుగా అన్నారు. వైసీపీపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు.
Also Read : ఇదెక్కడి వాదన బాబూ: విజయసాయి ప్రశ్న