Sunday, February 23, 2025
Homeసినిమా'వినరో భాగ్యము విష్ణుకథ' విడుదల తేదీ ఖరారు

‘వినరో భాగ్యము విష్ణుకథ’ విడుదల తేదీ ఖరారు

GA2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్ కల్యాణమండపం’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ వంటి చిత్రాలతో జనాదరణ పొందాడు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. ప్రస్తుతం కిరణ్‌, కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు

జీఏ2 పిక్చర్స్‌ పతాకం పై బన్నీవాసు ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా..అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బూరు  దర్శకత్వం వహిస్తుండగా చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు చిత్రబృందం. మరి.. ఈ సినిమాతో అయినా కిరణ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్