Saturday, January 18, 2025
Homeసినిమావిరాట‌ప‌ర్వం గ్రేట్ ల‌వ్ స్టోరీ : రానా

విరాట‌ప‌ర్వం గ్రేట్ ల‌వ్ స్టోరీ : రానా

All about Love: పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, ఫిదా బ్యూటీ సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకం పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపధ్యంలో హీరో రానా మీడియాతో మాట్లాడారు. ఆ .. విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ) గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు, నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ. ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు, ఎంత త్యాగం చేస్తాడు ? స్క్రిప్ట్ చదివినప్పుడే చాలా డీప్ గా అనిపించింది. కథ చదివినప్పుడు చాలా బరువనిపించింది. ఒక లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో విరాటపర్వం కథ చదివినప్పుడు అలాంటి డీప్ ఫీలింగ్ కలిగింది. విరాటపర్వం లాంటి కథ ఎప్పుడూ వినలేదు, అంత భారం ఎప్పుడు తీసుకోలేదు.

Virataparvam Trailer

ఈ సినిమాలో రవన్న కానీ దళం సభ్యులు కానీ మరో ఉద్యమ నాయకులు కానీ ఖచ్చితమైన లక్ష్యంతో వుంటారు. కుటుంబ, స్నేహ సంబంధాలు కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తారు. ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా వెళ్తున్న రవన్న జీవితంలోకి వెన్నెల ప్రవేశిస్తుంది. ఇక్కడే ఒక మోరల్ డైలమా వుంటుంది. ఒక లక్ష్యం కోసం పని చేయాలా ? ఫ్యామిలీతో కలసి రిలాక్స్ అవ్వాలా? అనేది ఒక మోరల్ డైలమా.ఈ సినిమా మోరల్ డైలమా గురించి వుంటుంది.

ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ నేను పదేళ్ళుగా ఆ పాన్ లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను(నవ్వుతూ). కొన్ని కథలు తెలుగులోనే చేయాలి. విరాట పర్వం మొదలు పెట్టినప్పుడే మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు. ఇది ఒక ప్రాంతానికి సంబధించిన కథ. ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల స్వతహాగా సాహిత్యకారుడు. ఈ సాహిత్యం మరో భాషలో కుదరక పోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆలోచన పెట్టుకోలేదు. ఐతే మలయాళం, బెంగాళీ, హిందీలో డబ్ చేస్తున్నాం.

Virata Parvam June 17th

రవన్న, వెన్నెల కాకుండా ఈ సినిమా లో కనిపించే దాదాపు అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంది. ప్రధాన పాత్రలే కాకుండా మిగతా పాత్రలు చెప్పిన డైలాగ్స్, ఆలోచనలతో కూడా కథ వేగంగా ముందుకు వెళుతుంది. ”జరీనా వాహెబ్, ప్రియమణి, ఈశ్వరి రావు, నందిత దాస్.. ఈ పాత్రలన్నీ బలంగా వుంటాయి. ఇది మహిళా చిత్రం. స్క్రీనింగ్ చూసి అబ్బాయిలంతా వావ్ అంటే.. మహిళా ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని అద్భుతమని చెబుతున్నారు.

సాయి పల్లవి గొప్ప నటి. విరాట పర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇది వెన్నెల కథని ట్రైలర్ లో చెప్పాం. రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల పాత్రని సాయి పల్లవి తప్పితే మరొకరు చేయలేరు. సాయి పల్లవి చాలా సింపుల్ పర్శన్. ఆ సింప్లీసిటీ వల్లే ఇంత అద్భుతమైన నటన కనుబరుస్తుందని భావిస్తున్నాను. విరాట‌ప‌ర్వం ప్రివ్యూకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అందరూ వండర్ ఫుల్ అంటున్నారు. విరాటపర్వంలో మొదటిసారి ఓ పాట పాడాను. జ‌నాల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్