1980 నేపథ్యంలో రూపొందిన సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ రెడీ అవుతోంది. చైతన్య రావు – లావణ్య ప్రధానమైన పాత్రలను పోషించారు. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి, చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహించారు. విశ్వక్ సేన్ చీఫ్ గెస్టుగా ఈ వేడుక జరిగింది.
ఈ స్టేజ్ పై విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ఇందాకటి నుంచి ఇది చిన్న సినిమా .. చిన్న సినిమా అని అంటున్నారు. మనమే చిన్న సినిమా అని చెబితే, చిన్న సినిమాకి ఏం పోతాంలే అనుకుని ఎవరూ థియేటర్లకు రారు. చిన్న సినిమానా .. పెద్ద సినిమానా అనేది నిర్ణయించేది ఆడియన్స్. చిన్న సినిమానా .. పెద్ద సినిమానా అనేది రిలీజ్ తరువాతనే తెలుస్తుంది. రిలీజ్ తరువాత హిట్ కొట్టి పెద్ద సినిమాలుగా వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయని అన్నారు. నిర్మాత యశ్ రంగినేని కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
1980లలో టీనేజ్ లో ఉన్నవారికీ, ఈ జనరేషన్ కి కూడా ఈ సినిమా నచ్చుతుందనీ, పేరెంట్స్ తో కలిసి హాయిగా చూసే సినిమా ఇది అని హీరో చైతన్యరావు అన్నారు. ఇక హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ .. గతంలో తాను విష్వక్సేన్ గారి సినిమాలో చిన్న రోల్ చేశాననీ, అయితే ఆ సీన్స్ ఎడిటింగులో లేచిపోయాయని అన్నారు. ఈ సినిమా ఫంక్షన్ కి ఆయన గెస్టుగా రావడం హ్యాపీగా అనిపించిందని చెప్పారు. ఈ సారి తాను డైరెక్ట్ చేసే సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇస్తానని విష్వక్ నవ్వేశారు.