Saturday, January 18, 2025
Homeసినిమా‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల

ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి ‘పాగ‌ల్’ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విష్వ‌క్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఎద‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడు. శ‌నివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో హీరో విష్వ‌క్ సేన్ ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన లుక్‌, పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. టైటిల్ పోస్ట‌ర్‌లో విష్వ‌క్ లుక్‌తో పాటు త‌ను ఏం ప‌ని చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు అని తెలిసేలా వివ‌రాల‌ను కార్డులో పొందుప‌రిచారు.

ఇక మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ‘‘వ‌య‌సు ముప్పై దాటేసింది.. జుట్టు కూడా.. పొట్ట కూడా..! పొట్ట కూడా వ‌చ్చేసింది. మా కులంలో అమ్మాయిలు దొర‌క‌డం లేదు, కొంచెం ఏదైనా సంబంధం ఉంటే చూసి పెట్టొచ్చుగా.. పెద్ద ప‌ట్టింపులు కూడా ఏమీ లేవు.. క‌ట్నం కూడా వ‌ద్దు అర్జున్ నా పేరు.. అర్జున్ కుమార్ అల్లం, మొత్తం డీటెయిల్స్ కూడా పెట్టేస్తా, కొంచెం చూసి పెట్టేస్తా’ అనే డైలాగ్స్‌, అందులో విష్వ‌క్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్