పవన్ కళ్యాణ్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విశాఖ పట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ మాత్రం గాజువాకలో ఓడిపోయిన తర్వాత అక్కడి ప్రజలను ఒకసారి కూడా పలకరించలేదని ఆరోపించారు. తన రాజీనామా అడిగే హక్కు పవన్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. విశాఖ వదిలిపెట్టి వెళ్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని, రాజకీయాల్లో కొనసాగుతూ ఇక్కడ వ్యాపారం చేయటం ఇబ్బందిగా ఉందని మాత్రమే తాను అన్నానని ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
దమ్ముంటే మరోసారి గాజువాకలో పోటీ చేయాలని లేదా విశాఖలో తనపై ఎంపీగా పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు చెట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారని, కనీసం గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకో లేకపోయారని దుయ్యబట్టారు. 25 ఏళ్ళ నుంచి వ్యాపారాలు చేస్తున్నారని ఎన్నో అపార్ట్మెంట్లు నిర్మించాలని… క్రమం తప్పకుండా టాక్స్ లు చెల్లిస్తున్నాననని, తన కంపెనీల వల్ల ఎంతోమంది యువతకు ఉపాధి కూడా కల్పించానని వివరించారు.
రాజకీయాల్లో ప్రజలకు ఏదో చేస్తానని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ మరి సినిమాలు ఎందుకు చేస్తున్నారని, కోతిలా ఎందుకు గెంతుతున్నారని ఘాటుగా ప్రశ్నించారు. రాజకీయంగా ఎంపీ అయినంత మాత్రాన వ్యాపారాలు చేయకూడదా? పదిమందికి ఉపాధి కల్పించకూదా అంటూ కళ్యాణ్ సూటిగా నిలదీశారు. తనకు ధైర్యం లేదని పవన్ అంటున్నారని ముందు ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని… ఒకరి మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నారని ధ్వజమెత్తారు. కాపు కులస్తుల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి పవన్ రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు బూట్లు నాకుతున్నారని మండిపడ్డారు.