కొన్నిరోజులుగా రాష్ట్రంలో వీ అర్ ఏ లు వారి డిమాండ్ లకోసం వర్షం లో సైతం జిల్లా కలెక్టరెట్ ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.ఎంతో ప్రాముఖ్యత కల్గిన రెవెన్యూ మంత్రి పదవి కూడా ముఖ్యమంత్రి తన చేతిలో పెట్టుకొని కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. కరీంనగర్ లో నిరవధిక దీక్ష చేస్తున్న వి ఆర్ ఏ లకి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఈ రోజు సంఘీభావం ప్రకటించారు.
ప్రగతి భవన్ సాక్షిగా తేదీ 24 ఫిబ్రవరి 2017 మహాశివరాత్రి పండగ రోజున మంత్రుల సాక్షిగా ఉన్నత అధికారుల సాక్షిగా ముఖ్యమంత్రి గ్రామ రెవెన్యూ సహాయకుల కు (vra) ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామన్నామని పొన్నం గుర్తు చేశారు. పే స్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని, రిటైర్మెంట్ లేని వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని, వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికీ 5 సంవత్సరాలు పూర్తయిన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాలేదని మంది పడ్డారు.
ఆ తరువాత సెప్టెంబర్ 9 2020 రోజున గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు అందరికీ పే స్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటన చేశారు. రిటైర్మెంట్ లేని వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు నేటికీ 22 నెలలు గడచిన అసెంబ్లీ ప్రకటన అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి వీఆర్ఏలకు అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటనలు వెంటనే అమలు చేయాలని అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పొన్నం హెచ్చరించారు .
Also Read : వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి