Sunday, January 19, 2025
Homeసినిమా200 కోట్లు రాబట్టేసిన 'వాల్తేరు వీరయ్య'

200 కోట్లు రాబట్టేసిన ‘వాల్తేరు వీరయ్య’

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ బ్యానర్లో .. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూపొందింది. ఈ సినిమా సెకండాఫ్ లో రవితేజ కూడా ఎంటరవుతాడు. అప్పటి నుంచి బాస్ ను .. మాస్ ను కలుపుకుని కథ ముందుకు వెళుతుంది. అయితే డే వన్ నుంచి వసూళ్ల విషయంలో ఢోకా లేకపోయినా, కథాకథనాల పరంగా కొత్తదనం లేదనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమయ్యాయి. రవితేజ పాత్ర కూడా ఆయన ఎనర్జీకి తగిన రేంజ్ లో లేదనే టాక్ వచ్చింది.

మరో వైపున బాలయ్య సినిమా తొలి రోజునే బలమైన సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ వంటి విలన్ రోల్స్ కూడా చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేయబడ్డాయి. ఈ రెండు సినిమాలను నిర్మించింది ఒకే బ్యానర్ అయినప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం ఒక రకమైన కుతూహలాన్ని కాలిగించాయి.  ఈ నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ వీకెండ్ తరువాత ఎలా ఉండనుందనే సందేహం అందరిలో తలెత్తింది.

పండుగ రోజులు కనుక వసూళ్లను గురించిన బెంగలేదు. ఆ తరువాత పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చిరంజీవి ఇమేజ్ .. రవితేజ క్రేజ్ .. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్  కావడం కోసం వారు చేసిన మేజిక్ వర్కౌట్ అయింది. ఇదే విషయాన్ని నిరూపిస్తూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 200 కోట్లకి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందనేది చూడాలి.

Also Read : రేటింగ్స్ పై ‘మెగా’ కౌంటర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్