Tuesday, September 17, 2024
Homeసినిమాభారీ వ్యూస్ తో 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్

భారీ వ్యూస్ తో ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ అంచనాలని పెంచింది. వాల్తేరు వీరయ్య మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఇటివలే విడుదలైన ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ‘.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అలరిస్తోంది. ‘బాస్ పార్టీ’ సాంగ్ 25 +మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇన్స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లో రీల్స్ రూపంలో కూడా బాస్ పార్టీ’ సాంగ్ వైరల్ గా మారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

‘వాల్తేరు వీరయ్య’ నుండి తాజాగా విడుదలైన మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ -విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ ఎంట్రీ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజలని ఎప్పుడెప్పుడు తెర పై చూద్దామానే క్యూరీరియాసిటీ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌లో లీడ్‌ పెయిర్‌ పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్‌లో చిరంజీవి, శృతి హాసన్‌లపై చిత్రీకరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్