Sunday, January 19, 2025
Homeసినిమావాల్తేరు వీరయ్య పూనకాలకు పక్కా ప్లానింగ్

వాల్తేరు వీరయ్య పూనకాలకు పక్కా ప్లానింగ్

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా పై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన రావడంతో సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో వాల్తేరు వీరయ్య టీమ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి వస్తున్న మరో మాస్ సాంగ్ పూనకాలు లోడింగ్ అని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ కి అయితే మేకర్స్ సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సాంగ్ కోసం గాను మేకర్స్ భారీ ఎత్తున ఈవెంట్ సహా థియేటర్స్ లో ఈ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది.

అలాగే దీని పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది. వీరసింహారెడ్డి మూవీ నుంచి ఇటీవల మా బావ మనోభావాలు అనే సాంగ్ ను థియేటర్లో రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి మెగా అభిమానులు వాల్తేరు వీరయ్య సినిమా నుంచి సాంగ్ ను థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పూనకాలు లోడింగ్ సాంగ్ ను థియేటర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారట. మరి.. ఈ సాంగ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్