Sunday, January 19, 2025
Homeసినిమాఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన 'వాల్తేరు వీరయ్య'

ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన ‘వాల్తేరు వీరయ్య’

Mini Review: చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించింది. ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. అటు చిరంజీవికీ .. ఇటు రవితేజకి కూడా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ రూపొందడంతో అందరిలో ఆసక్తి పెరుగుతూ పోయింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

వీరయ్య (చిరంజీవి) విక్రమ్ (రవితేజ) ఇద్దరూ కూడా అన్నదమ్ములు .. కాకపోతే వారి తల్లులు వేరు. వీరయ్య ‘వాల్తేరు లోని ‘జాలరిపేట’లో పెరిగి పెద్దవాడవుతాడు. చిన్నతనంలోనే తల్లితో పాటు వెళ్లిపోయిన విక్రమ్, పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కోర్టు ద్వారా ఒక కేసును గెలవడానికి ఆవాసారమైన డబ్బు కోసం వీరయ్య ఒక భారీ డీల్ కుదుర్చుకుంటాడు. మలేసియాలో డ్రగ్స్ మాఫియాను శాసిస్తున్న సాల్మన్ (బాబీ సింహా)ను పట్టుకుని అప్పగించడమే ఆ డీల్. ఆ పనిమీద అక్కడికి వెళ్లిన వీరయ్యకి, సాల్మన్ వెనుక అతని అన్నయ్య మైఖేల్ ( ప్రకాశ్ రాజ్) ఉన్నాడని అర్థమవుతుంది. ఆ అన్నదమ్ముల ఆట కట్టించడానికి వీరయ్య ఏం చేశాడు? ఎలా చేశాడు? అనేదే కథ.

ఇది చిరంజీవి మాస్ మార్క్ కి సంబంధించిన కథనే .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రనే. కాకపోతే ఆయన స్థాయికి తగినట్టుగా .. ఆయన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించినట్టుగా బాబీ ఆవిష్కరించలేకపోయాడేమో అనిపించకమానదు. చిరంజీవీ –  రవితేజల స్టార్ డమ్ .. వారి ఎనర్జీకి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేయలేదేమో అనిపిస్తుంది. దానికి తోడు వీరి జోడీలకు కూడా పెద్దగా పనిలేదు. ఇక విలన్స్ గా ప్రకాశ్ రాజ్ – బాబీ సింహా ట్రాక్ నాటకీయంగా అనిపిస్తుంది. మెగాస్టార్ నుంచి డాన్సులు .. ఫైట్లకి కొదవలేదు. అక్కడక్కడా కామెడీ .. ఎమోషన్ కూడా కనెక్ట్ కావడనికి ట్రై చేస్తాయి. కాకపోతే చిరంజీవి సినిమాకి తగిన పాళ్లు కలవలేదని అభిమానులు అనుకోకుండా ఉండటం కష్టమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్