Sunday, January 19, 2025
Homeసినిమాహిందీలోనూ రిలీజ్ అవుతున్న 'వాల్తేరు వీరయ్య'

హిందీలోనూ రిలీజ్ అవుతున్న ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుంటే.. రవితేజ సరసన కేథరిన్ నటిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో వాల్తేరు వీరయ్య సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీమ్ ఈ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా టీమ్ అంతా వాల్తేరు వీరయ్య సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే.. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని.. అది కూడా తెలుగుతో పాటే హిందీలోనూ జనవరి 13నే విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే.. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాలు హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి కానీ.. ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. మరి.. వాల్తేరు వీరయ్య హిందీలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్