Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్తిరుపతిలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే

తిరుపతిలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే

చెస్ ఒలింపియాడ్ టార్చ్ కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది.  SV ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు… ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, క్రీడాకారులు, పలు స్కూళ్ళ విద్యార్ధినీ విద్యార్థులు, NCC కాడెట్స్ ఈ టార్చ్ తో రిలే ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ ర్యాలీలో పాల్గొని  ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో చెస్ గ్రాండ్ మాస్టర్ ఆకాశ్ నుంచి టార్చ్ ను అందుకున్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ చెస్ క్రీడాకారులు , గ్రాండ్ మాస్టర్ లు దేశ విదేశాల లో ప్రతిభ కనపరచారని, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి, గ్రాండ్ మాస్టర్ మునుసూరి రోహిత్, లలిత్ బాబు లాంటి వారు మచ్చుతునకలు అని అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. చివరగా చెస్ గ్రాండ్ మాస్టర్ ఆకాశ్ కు ఒలింపియాడ్ టార్చ్ ను రోజా అందించారు. ఇక్కడి నుంచి చెస్ ఒలింపియాడ్ టార్చ్ పుదుచ్చేరి వెళ్లనుంది.

ద్వైవార్షిక 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ కు ఈసారి భారతదేశం ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. 2022 జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు తమిళనాడు మహాబలిపురంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని పలు నగరాల్లో ఈ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తారు,  టోర్నీ ప్రారంభమయ్యే నాటికి ఈ టార్చ్ మహాబలిపురం చేరుకుంటుంది.

Also Read : విశాఖ ఒలింపియాడ్ టార్చ్ కు స్వాగతం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్