Thursday, May 30, 2024
HomeTrending Newsపోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: అంబటి

పోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: అంబటి

We are committed: పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర జలవనరుల  శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తారని, ఒక్కసారిగా పూర్తి కెపాసిటీతో నింపితే ప్రమాదాలు వస్తాయని వెల్లడించారు. పోలవరం పై సి డబ్ల్యూసి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, నిర్ణయం తీసుకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 45.72  మీటర్ల ఎత్తుగా పోలవరం సామర్ధ్యం ఉందని, సహాయ పునరావాస కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా మొదట 41.15 మీటర్లు మొదటగా కట్టి, అక్కడివరకూ నీటిని  నింపి పాక్షికంగా  ప్రాజెక్టు నుంచి నీటి లబ్ధి పొందే విధంగా ఏర్పాటు చేస్తారన్నారు. ఆ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో  నిర్మాణం చేస్తారన్నారు.

పునరావాసం రెండు ముక్కలు అంటూ ఓ మీడియా రాసిన కథనాన్ని అంబటి తప్పు బట్టారు. అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం కోసం చిత్తశుద్దిగా పనిచేస్తున్న ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు, అలజడి కలిగించే ప్రయతం అనివిమర్శించారు.  సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందన్నారు.

గత  ప్రభుత్వ హయంలో సంక్లిష్టమైన ఏ పనులనూ చేపట్టలేదని, కమీషన్ల కక్కుర్తి కోసం ఈజీగా అయిపోయే పనులు మాత్రమే  చంద్రబాబు చేశారని విమర్శించారు. ముందు చేపట్టాల్సిన నిర్మాణాలు  చేయకుండా చివర్లో చేయాల్సిన పనులు ముందే పెట్టుకుని ప్రాజెక్టుకు నష్టం చేశారని, అందుకే 800 కోట్ల రూపాయల అదనపు భారం చేయాల్సి వచ్చిందని వివరించారు.

ముందు స్పిల్ వే నిర్మాణం చేసిన తర్వాత, దయా ఫ్రం వాల్,  ఆ తర్వాతా ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ చంద్రబాబు ముందే కాపర్ డ్యామ్ పూర్తి చేశారని అంబటి దుయ్యబట్టారు.

Also Read : పోలవరం ఇంచు కూడా తగ్గించం: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్