అప్కాబ్ లో నాడు డా. వైఎస్సార్ ఎన్నో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారని, వైద్యనాథన్ సిఫార్సులను ఆమోదించి కోపరేటివ్ క్రెడిట్ సిస్టమ్ ను బలోపేతం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనికోసం 1850 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఇలా చేసిన తొలి రాష్ట్రంగా కూడా ఘనత వహించారని గుర్తు చేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అప్కాబ్ వర్జోత్సవ వేడుకలకు సిఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులకు 2008 ఖరీఫ్ నుండి పావలా వడ్డీ రుణాలకు కూడా వైఎస్సార్ శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆయన మరణం తర్వాతా అప్కాబ్ మరోసారి ఇబ్బందులో పడిందన్నారు.
భారత దేశంలో రైతు అప్పుల్లోనే పుట్టి, అప్పుల్లోనే పెరిగి అప్పుల్లోనే చనిపోతాడనే నానుడి ఉండేదని, విత్తనం నుంచి పంట కోత వరకూ పెట్టుబడి అవసరం అవుతుందని, దానికోసం రైతులు అప్పులు చేయాల్సి వస్తుందని, వాటికి వడ్డీలు కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేయడం ద్వారా తక్కువ వడ్డీ కే రుణాలు అందాయని, దీనితో రైతు నిలదొక్కుకోగలిగారని అన్నారు. అప్కాబ్ రావడం అనేది ఓ చారిత్రాత్మక అవసరమని అన్నారు. అప్కాబ్ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సహకార రంగ చరిత్రలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న రోజుగా పేర్కొన్నారు.
సిఎం ప్రసంగంలో ఇతర ముఖ్యాంశాలు
- కోఆపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ ఆప్‌కాబ్‌లో డీసీసీబీ బోర్డ్స్‌లో ప్రొఫెషనల్స్ కూడా ఉంటేట్లుగా చర్యలు తీసుకున్నాం.
ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలు పెడతారో రాజకీయంగా వేరే అడుగులు వేసే కార్యక్రమం కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. - ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీ బ్యాంకులకు ఆప్‌కాబ్‌కు గతేడాది 295 కోట్లు షేర్ క్యాపిటల్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించడం జరిగింది.
- ఆప్‌కాబ్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ట్రాన్స్‌ఫరెన్సీ, ఎఫిషియన్సీ పెంపొందిచేందుకు కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాం.
- టీసీఎస్‌ను ఇన్వావల్వ్ చేసి కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.
- ఈ చర్యలన్నింటి వల్ల రాష్ట్రంలో సహకారపరపతి సంఘాల వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది.
- 2019 నుంచి నాలుగేళ్ల కాలంలోనే సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరిగాయి. ఆప్‌కాబ్ లావాదేవీలు విస్తరించాయి.
- 2019 మార్చి 31 నాటికి 53249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటకి లక్షా 5 వేల 89 కోట్లకు చేరింది. నాలుగు సంవత్సరాల్లో ఏకంగా డబుల్ అయిన పరిస్థితి.
- 2019లో 13700 కోట్లుగా ఉన్న ఆప్‌కాబ్ పరపతి 2023 నాటికి ఏకంగా 36700 కోట్లకు పెరిగింది. అంటే 3 రెట్లు పెరిగింది.
- గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నా.
- 36 ఏళ్ల తర్వాత లాభాలు గడించిన కర్నూలు డీసీసీబీని ఈరోజు మనం చూస్తున్నాం.
- 68 సంవత్సరాల తర్వాత లాభాలు పొందుతున్న కడప డీసీసీబీని కూడా చూస్తున్నాం.
- గొప్పగా అడుగులు వేయగలిగినందుకు సిబ్బందికి, యాజమాన్యానికి మనస్పూర్తిగా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నా.
- ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ పూర్తవుతుందో ఆప్‌కాబ్, డీసీసీబీల బలోపేతం పూర్తవుతుందో ఈరోజు మనం చూస్తున్న మార్పులే కాకుండా ఇంకా మెరుగైన ఫలితాలు రాబోయే రోజుల్లో చూస్తాం.
- ఇందుకోసం 25 కోట్లు కేటాయింపులుచేశాం. పనులు వేగంగా జరుగుతున్నాయి.
- కో గొప్ప మార్పు.. రైతు భరోసా కేంద్రాలను ప్యాక్ట్స్ అనుసంధానం చేశాం.
- ఈరోజు మిగిలిన బ్యాంకుల సహకారంతో ఈరోజు ప్రతి ఆర్బీకేలో కూడా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి వచ్చింది.
- రాబోయే రోజుల్లో రైతులకు ఆర్బీకేల వద్దనే క్రెడిట్స్‌తో సహా వ్యవసాయ ఇన్‌పుట్‌లు పొందే పరిస్థితి రాబోయే వస్తుంది.
- ఈ క్రాపింగ్ ప్రతి ఆర్బీకే స్థాయిలో జరుగుతోంది. కంప్యూటరైజేషన్ జరుగుతోంది.
- ఈరోజు రైతులందరికీ ఆప్‌కాబ్ అన్నది సేవలన్నీ విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- ఆర్బీకే స్థాయిలోనే ఫామ్‌మెకనైజేషన్ తీసుకొచ్చాం.
- రైతులు గ్రూప్‌గా ఫామ్ అయ్యి 10 శాతం కడితే ఒక 40 శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తోంది.
- ఆర్బీకే స్థాయిలోనే ఇక్విప్‌మెంట్స్ అందుబాటులోకి వస్తోంది.
- దీని కోసం ఏకంగా ఆప్‌కాబ్ దగ్గర నుంచి 500 కోట్లు రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది.
- గ్రామస్థాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12 శాతం, లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న పరిస్థితి.
- రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే గ్రామస్థాయిలో వ్యవసాయంతో పాటు పాడి, పంట, వారి ఆర్థిక స్వావలంబన ఆధారపడి ఉన్నాయి.
- అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఆప్‌కాబ్ ద్వారా జరిగింది.
- పాడి పంట, ఆవులు, మేకలు కొనుక్కోవడం పెరిగిన పరిస్థితులు చూస్తున్నాం.
- ఆప్‌కాబ్, డీసీసీబీలు, ప్యాక్ట్స్‌తో అనుసంధానం అయిన ఆర్బీకేలు.. ఈ వ్యవస్థ దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకూ ఉండని పరిస్థితి మన ఆప్‌కాబ్‌కు మాత్రమే ఉంటుందని చెబుతున్నా.
- డిజిటల్ లైబ్రరీలు తయారవుతున్నాయి. ఫైబర్‌నెట్ గ్రామస్థాయిలోకి చేరుకుంటోంది.
- ఇవన్నీ రాబోయేరోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.
- ఆప్‌కాబ్ ఇక్కడి నుంచి కూడా ఇంకా గొప్పగా ఎదగాలని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా