మనం కష్టంలో ఉన్నపుడు చుట్టూ ఉన్నవారు ఒక్కోలా వారికి తెలిసిన రీతిలో సహాయం చేస్తారు. సలహాలు ఇస్తారు. అన్ని బాధలూ తాగి మరచి పొమ్మనే మిత్రుడు ఒకరైతే భగవధ్యానం చేయమనేవారు మరొకరు. మనకు తగిలిన గాయానికి ప్రతీకారం తీర్చుకోమని ఒకరంటే క్షమించి, మరచిపోయి, ముందుకు సాగమని ఇంకొకరంటారు. ఇన్నిరకాల సలహాలు ఇచ్చే స్నేహితులలో ఎవరిపైన ఆధార పడ్డాం అనేది గేమ్ చేంజర్ అని చెప్పచ్చు.
‘నాకు మంచి తెలుసు. కానీ చెయ్యలేను. చెడూ తెలుసు. చేయకుండా ఉండలేను’ అంటాడు దుర్యోధనుడు ఒక సందర్భంలో. ఒక్క దుర్యోధనుడే కాదు ఈ కాలంలో చాలామంది మార్గం ఇలాగే ఉంటోంది. ఇదంతా వారు ఎవరిని నమ్మి చేస్తున్నారు అనేదీ ముఖ్యమే. అలా దుర్యోధనుడు తన మామ శకునిని ఎంచుకున్నాడు. ఫలితంగా ఎంత దిగజారిపోయాడో మహాభారతం చెప్తుంది.
అదే అర్జునుడి దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. తన వ్యక్తిగత భావాలకు విలువ ఇస్తూ ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉండాలనుకున్నాడు. అందుకు ఆధారంగా కృష్ణుడిని ఎంచుకున్నాడు
ఫలితంగా చక్కటి స్థానానికి చేరుకున్నాడు.
మానవ జీవితమే అంత. ఎప్పుడో ఒకసారి అందరికీ ఆధారపడటానికి ఎవరో ఒకరు కావాలి. ఆ ఒకరు ఎవరు అనేదే అసలైన విషయం. సరయిన మార్గదర్శనం చేసే ఆధ్యాత్మిక గురువులను ఎంచుకోవాలి. వారి మాట వినాలి. నమ్మాలి. అనుసరించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సరయిన గురువును ఎంచుకోవాలి
(వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న పోస్టుకు స్వేచ్ఛానువాదం)