Sunday, January 19, 2025
Homeసినిమా#Mega156: చిరు 156 మూవీ లేనట్టేనా..?

#Mega156: చిరు 156 మూవీ లేనట్టేనా..?

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆమధ్య 156, 157 సినిమాలను ప్రకటించారు. 156వ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత బ్యానర్ లో చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు కానీ.. డైరెక్టర్ ఎవరు అనేది చెప్పకుండా సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే.. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు అని వార్తలు వచ్చాయి. ఇక 157వ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నట్టుగా.. ఈ చిత్రానికి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ గా తెలియచేశారు. అయితే.. 157వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది కానీ.. 156వ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

చిరు 156వ చిత్రానికి దర్శకుడు మారతాడు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ నే పక్కనపెట్టాశారని వార్తలు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు కోటి ఖర్చు అయ్యిందని తేలిందట. అయినప్పటికీ స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఈ మూవీని ఆపేశారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవి.. కళ్యాణ్ కృష్ణకు సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అందుచేత ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

దీంతో చిరు, కళ్యాణ్ కృష్ణ మూవీ ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు కానీ.. 157వ మూవీ గురించి మాత్రం వార్తలు వస్తున్నాయి. 156వ చిత్రం గురించి క్లారిటీ రావాలంటే సుస్మిత కొణిదెల చెప్పాలి. మరి.. 156 మూవీ సస్పెన్స్ కు తెర దించుతూ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్