Wednesday, January 22, 2025
Homeసినిమారామ్, త్రివిక్రమ్ మూవీ లేనట్టేనా..?

రామ్, త్రివిక్రమ్ మూవీ లేనట్టేనా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. దర్శకుడుగా తొలి సినిమా నువ్వే నువ్వే. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.నువ్వే నువ్వే మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ కు తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందించింది. అందుకనే ఆ బ్యానర్ రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆ ఫ్యామిలీకి చెందిన హీరో రామ్ తో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ఆమధ్య ఓ వేడుకలో కూడా త్రివిక్రమ్.. స్రవంతి రవి కిషోర్ పై ఉన్న అభిమానంను చూపించారు. దీంతో రామ్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్‌ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత రామ్ తో కాకుండా బన్నీతో సినిమాను అనౌన్స్ చేశారు. దీంతో రామ్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ‘స్కంద’ అనే సినిమా చేస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

స్కంద సినిమా తర్వాత రామ్, పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టులో స్టార్ట్ చేసి మార్చిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత అయినా త్రివిక్రమ్ తో రామ్ సినిమా ఉంటుందా అంటే.. అనుమానమే అని టాక్. త్రివిక్రమ్ వరుసగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. రామ్ వంటి చిన్న స్టార్ తో సినిమా చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. మరి.. త్రివిక్రమ్ రామ్ తో సినిమా గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్