Sunday, February 23, 2025
HomeTrending Newsప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తాం-హ‌రీశ్ రావు

ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తాం-హ‌రీశ్ రావు

We Will Respect The Judgment Of The People Harish Rao :

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరున క్ర‌త‌జ్ఙ‌త‌లు తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌న్య‌వాదాలని, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ త‌గ్గ‌లేదన్నారు.
అయితే, దేశంలో ఎక్క‌డ‌లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు క‌ల్సిప‌నిచేశాయని మంత్రి ఆరోపించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారని, ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదన్నారు. తెరాస పార్టీ గెలిచిన‌నాడు పొంగిపోలేదని,  ఓడినా.. గెలిచినా టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీష్ రావు అన్నారు.

Must Read :సిద్దిపేటలో నీ సంగతి తేలుస్తా…

RELATED ARTICLES

Most Popular

న్యూస్