Thursday, January 23, 2025
HomeTrending NewsTDP: ప్రతి మాటకూ బదులిస్తాం: బొండా ఉమా

TDP: ప్రతి మాటకూ బదులిస్తాం: బొండా ఉమా

గుడివాడలో చంద్రబాబు పోటీ చేయాల్సిన అవసరం లేదని,  తమ పార్టీనుంచి ఓ చిన్న కార్యకర్తను పోటీకి దింపి గెలిపిస్తామని టిడిపి నేత బొండా ఉమా బదులిచ్చారు. దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలంటూ చంద్రబాబుకు  కొడాలి నాని చేసిన సవాల్  పై ఉమా స్పందించారు. కొడాలి నాని నమ్మక ద్రోహి అని, రెండుసార్లు బాబు ఇచ్చిన బి-ఫామ్ తో గెలిచి ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బొంద మీడియాతో మాట్లాడారు.

గతంలో బాబు, ఎన్టీఆర్, హరికృష్ణలకు… పార్టీ ఆఫీసులో టీలు, కాఫీలు అందించిన నాని ఇప్పుడు అధికార మదంతో మాట్లాడుతున్నాడని, వచ్చే ఎన్నికల తర్వాత నాని మాట్లాడుతున్న ప్రతి మాటకూ బదులు చెబుతామని హెచ్చరించారు.

నేడు సిఎం జగన్ ప్రారంభించిన ఇళ్ళు ఎవరి హయంలో మొదలు పెట్టారో కొదాలికి తెలియదా, ఈ ఇళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఇళ్ళు చంద్రబాబు  కట్టిస్తే నాలుగేళ్ళపాటు పాటు లబ్దిదారులకు అందించకుండా, వీటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నాలుగువేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చి… తీరా ఎన్నికల సమయానికి  ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని బొండా విమర్శించారు.  ప్రజా కోర్టులో కొడాలి నానికి సమాధానం చెబుతామన్నారు.

రాష్ట్రంలో ఒక ఎంపి కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారంటే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్ధమవుతుందన్నారు. గతంలో బాబు హయంలో ఆర్ధిక, వాణిజ్య రాజధానిగా ఉన్న విశాఖ జగన్ నాలుగేళ్ల పాలనలో ఇప్పుడు నేరాలకు అడ్డాగా నిలిచిందని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్