తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతల ఇళ్ళను లీగల్ గానే కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని పునరుద్ఘాటించారు. వైసీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే ఏం చేయాలో తనకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ళ కూల్చివేత బాధితులకు జనసేన తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ మాట్లాడారు. ఇప్పటంలో కక్ష పూరితంగా కూచివేయడం తనకు బాధ కలిగించిందన్నారు.
తాను వైసీపీ నేతల్లాగా ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పానని, మోడీని కలిసినప్పుడు దేశ భవిష్యత్, ప్రజల రక్షణ గురించే మాట్లాడతానని అన్నారు. వైసీపీని దెబ్బ కొట్టాలంటే మోడీకి చెప్పి చేయనని, తానే చేస్తానంటూ సవాల్ చేశారు. “నేను ఇక్కడ పుట్టినవాణ్ణి..ఇక్కడే తేల్చుకుంటా… నా యుద్ధం నేనే చేస్తా… మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం… ఏమనుకుంటున్నారు’ అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రజలు కట్టే పన్నులతో సంక్షేమ పథకాలు చేస్తూ వాటికి మీ పేర్లు ఎలా పెట్టుకుంటారని…. విద్యా దీవెన పథకానికి గుర్రం జాషువా పేరు ఎంతుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. మీరు ఓట్లు వేసి గెలిపించినా, గెలిపించాకపోయినా మీకు అండగా ఉంటానంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కూడా పవన్ విమర్శలు చేశారు…. మీరు మర్యాదగా వ్యవహరిస్తే… మేం చాలా పధ్ధతి గల వ్యక్తులమని, మీరు పద్ధతిగా మాట్లాడితే మా సంస్కారులు మర్కొకరు ఉండను, మీరు నీచానికి దిగారారితే మా అంత విప్లవకారులు మరొకరు ఉండరు అని పవన్ వ్యాఖ్యలు చేశారు.