Sunday, February 23, 2025
Homeతెలంగాణఎందుకంత తొందర : హైకోర్టు

ఎందుకంత తొందర : హైకోర్టు

దేవరయంజాల్ భూముల విచారణలో ప్రభుత్వ తీరును హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. ప్రభుత్వం విడదల చేసిన జిఓను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. కరోనా విపత్కర సమయంలో ఇంత హడావుడి అవసరమా అని ప్రశ్నించింది. తమ పక్కన వ్యక్తి చనిపోతే స్మశానానికి తీసుకెళ్లేందుకు చాలా సమయం పట్టిందని జస్టీస్ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో కేసు విచారణ కోసం నలుగురు అధికారుల తో కమిటీ ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జిఓలు ఇస్తారా అని నిలదీశారు.

కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని, ఎవరినీ ఖాళీ చేయించడం లేదని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తెచారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చట్టప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ భూముల విషయంలో హైకోర్ట్ గతంలోనే స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిందని, పిటిషనర్ ఆ ఆదేశాలను గౌరవించలేదని వివరించారు.  అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్