ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ వచ్చింది. ఆతర్వాత విమర్శలు వచ్చినప్పటికీ ఫస్ట్ వీక్ కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిన తర్వాత ప్రభాస్ అమెరికాకి వెళ్లిపోయాడు కానీ.. ఇండియాకు తిరిగి రాలేదు. ఆదిపురుష్ కు ఇలాంటి స్పందన వస్తుందని ముందే తెలుసనుకుంటా ఆతర్వాత నుంచి ఎలాంటి ప్రచారం చేయలేదు. ఇండియా వస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ.. ఇంకా ప్రభాస్ అమెరికా నుంచి ఇండియా రాలేదు అని టాక్.
మరి.. ప్రభాస్ ఇండియాకు ఎప్పుడు వస్తాడంటే… ప్రాజెక్ట్ కే ఈవెంట్ తర్వాత ఇండియాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఇందులో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్, కమల్ హాసన్ నటిస్తున్నారు. దీపికా పడుకునే, దిశా పటానీ కథానాయికలు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాని దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీ మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించింది. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్ కు హాజరు కానున్న తొలి భారతీయ సినిమా గా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది. ఈ ఈవెంట్ ఈ నెల 20న జరగనుంది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత ప్రభాస్ ఇండియా కు తిరిగి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి.