Saturday, January 18, 2025
Homeసినిమాబ‌న్నీ నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఎప్పుడో?

బ‌న్నీ నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఎప్పుడో?

Next What? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఇది ఇటు బ‌న్నీకి అటు సుకుమార్ కి ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. దీంతో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే.. అంచ‌నాల‌కు మించిన స‌క్సెస్ ను పుష్ప సాధించింది. దీంతో పుష్ప 2 పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా.. బ‌న్నీ ఇమేజ్ కూడా అమాంతం పెరిగింది.

బాలీవుడ్ నుంచి భారీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ బ‌న్నీ కంగారుప‌డడం లేదు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా పుష్ప 2 పైనే ఉంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన పుష్ప 2… అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో మ‌ళ్లీ సుకుమార్ క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తుండ‌డం వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. ఆగ‌ష్టు నుంచి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే.. పుష్ప 2 త‌ర్వాత అల్లు అర్జున్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

బ‌న్నీతో సినిమా చేసేందుకు వేణు శ్రీరామ్, బోయ‌పాటి, మురుగుదాస్, కొర‌టాల‌, అట్లీ రెడిగా ఉన్నారు. దీంతో వీళ్ల‌ల్లో ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వ‌నున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప త‌ర్వాత బ‌న్నీ క‌థ‌ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. పాన్ ఇండియా స్టోరీల‌నే ఎంచుకోవాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. అయితే.. ద‌స‌రా త‌ర్వాత నెక్ట్స్ మూవీ పై క్లార‌టీ ఇస్తాడ‌ట బ‌న్నీ. మ‌రి.. ఎవ‌రితో చేస్తాడో చూడాలి.

Also Read : బ‌న్నీ-మురుగుదాస్ కాంబినేష‌న్ ఫిక్స్ అయ్యిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్