Sunday, January 19, 2025
HomeసినిమాPawan Kalyan: దిల్ రాజు పవన్ ను వద్దన్నారా?

Pawan Kalyan: దిల్ రాజు పవన్ ను వద్దన్నారా?

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందుకనే నిర్మాతలు, దర్శకులు పవన్ తో ఒక్క మూవీ అయినా చేయాలనుకుంటారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. ఎంత బడ్జెట్ అయినా ఓకే అంటారు. అయితే.. ఓ డైరెక్టర్ పవర్ ఫుల్ స్టోరీ చెప్పి.. ఈ కథతో పవర్ స్టార్ తో సినిమా చేద్దామంటే.. దిల్ రాజు వద్దు అన్నారట. అవును.. ఇది నిజంగా నిజం. ఇంతకీ ఆ.. డైరెక్టర్ ఎవరంటారా..? సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్. అవును.. శంకర్.. దిల్ రాజుకు కథ చెప్పిన తర్వాత ఈ కథకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటారని అంటే.. వద్దు.. రామ్ చరణ్ తో చేద్దామన్నారట.

దిల్ రాజు.. చరణ్ కు ఫోన్ చేసి శంకర్ గారు కథ చెప్పారు. చాలా బాగుంది.. నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనడంతో చరణ్‌ కథను విన్నాడట. ఆయనకు కూడా నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిందట. అదే.. పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తుంటే… డైరెక్టర్ టర్నడ్ యాక్టర్ ఎస్.జె.సూర్య  విలన్ గా నటిస్తున్నారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.
అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఒక్క పాటకు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు పెట్టి 5 పాటలు తెరకెక్కించారని దిల్ రాజు చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం పూర్తయిందట. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నా వచ్చే సమ్మర్ కే  వస్రాతుందని సమాచారం.

ఇంతకీ పవన్ తో ఎందుకు వద్దన్నారంటే… ఇది పొలిటిలక్ స్టోరీ.. ఆయనతో చేస్తే.. రాజకీయంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతో చేశారనుకుంటారు. అదే.. రాజకీయాల్లో లేని చరణ్ చేస్తే.. బాగుంటుందని దిల్ రాజు అలా చెప్పారట. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి.. ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటారో?

Also Read : Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్ స్టైలిష్ లుక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్