Monday, January 20, 2025
Homeసినిమాత్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రయత్నం ఫలిస్తుందా?

త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రయత్నం ఫలిస్తుందా?

త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితం అయ్యారు కానీ.. పాన్ ఇండియా సినిమా తీయలేదు. మహేష్ తో చేస్తున్న మూవీని పాన్ ఇండియాగా చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశారు. గతంలో బన్నీ, త్రివిక్రమ్ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ కలసి నాలుగో చిత్రం చేస్తున్నట్లు  ప్రకటించారు.

అయితే.. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టోరీలు చేశారు. ఆయన చేసిన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయ్యాయి తప్పితే.. సక్సెస్ అవ్వలేదు. అల.. వైకుంఠపుములో హిందీలో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే.. ఫ్యామిలీ సబ్జెక్ట్ కాకుండా యాక్షన్ స్టోరీతో సినిమా చేయాలి. ఇంకా చెప్పాలంటే.. యూనివర్శిల్ అప్పీల్ ఉన్న స్టోరీతో పాన్ ఇండియా మూవీ చేయాలి. అందుచేత బన్నీతో చేసే పాన్ ఇండియా మూవీకి త్రివిక్రమ్ ఎలాంటి స్టోరీని ఎంచుకున్నారు అనేది ఆసక్తిగా మారింది.

సోషియో ఫాంటసీ మూవీ స్టోరీని ఎంచుకున్నారని.. ఇందులో భారీ యాక్షన్ తో పాటు వావ్ అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయని.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. పుష్ప సినిమాతో బన్నీకి నార్త్ లో భారీగా క్రేజ్ వచ్చింది. పుష్ప 2 తర్వాత మరింతగా క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అందుచేత ఇదంతా దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా స్టోరీ రెడీ చేశారట మాటల మాంత్రికుడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 మూవీలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ మహేష్‌ గుంటూరు కారం షూటింగ్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి రానుంది. మరి… బన్నీతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్