Withdrawal Of Agricultural Laws In Parliament  :

పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఆ త‌ర్వాత కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు రైతు సమస్యలపై చర్చకు పట్టు పట్టడంతో మొదట 12 గంటల వరకు లోక్ సభ స్పీకర్ ఓం  బిర్లా వాయిదా వేయగా సభ తిరిగి ప్రారంభమైనా సభ్యులు శాంతించలేదు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. రెండు గంటలకు కుడా నిరసనలు హోరేత్తడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొద‌లైంది. కానీ ఆ స‌మ‌యంలో టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమై డిసెంబర్‌ 23వ తేది వరకు కొనసాగనున్నాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్‌లో మొత్తం 19 పనిదినాలు ఉంటాయి. కీలకమైన 25 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. బిల్లుపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. అధికార విపక్షాల పోటా పోటీ నినాదాల మధ్య చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, అధిక ధరలు, పెట్రోల్ ధరలు, COVID సమస్యలపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. రైతులకు సంతాప తీర్మానాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కీలక బిల్లులు ఆర్డినెన్సుల స్థానంలో నార్కోటిక్స్‌ డ్రగ్, సైకోటిక్‌ సబ్‌స్టాన్సెస్‌ బిల్లు, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ బిల్లు, సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు, ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన కానిస్టిట్యూషన్‌ బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

Also Read :  రైతు క్షేమం ఆలోచించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *