ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన UAPA కేసును వెంటనే ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డిజీపీని ఆదేశించారు. ప్రజాసంఘాలు, మేధావుల నుంచి రెండు రోజులుగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉద్యమం నుంచి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ పదవులలో కొనసాగిన వారే కేసు ఉపసంహరించుకోవాలని తీవ్ర స్థాయిలో గలమెత్తారు. TSPSC చైర్మన్ గా పని చేసిన ఘంట చక్రపాణి, తెలంగాణ సమాచార కమిషనర్ గా పనిచేసిన కట్ట శేఖర్ రెడ్డి తదితరులు హర గోపాల్ కు బాసటగా నిలిచారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమించే ప్రమాదముందని కేసు ఉపసంహరించుకోక తప్పలేదు.
ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసును వెనక్కి తీసుకోవడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ప్రముఖ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు 152 మందిపై ములుగు పోలీస్ స్టేషన్లో ఉపా కేసు నమోదు చేయడానికి సిపిఐ తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వ్యతిరేకించడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపా కేసును వెనక్కి తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు…
ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసే విధంగా ఆయన ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు…