Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్WPL:  ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

WPL:  ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

విమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ రేసులో నిలిచింది. నేడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 11 పరుగులతో విజయం సాధించింది.  ఆష్లీ గార్డ్ నర్ ఆల్ రౌండ్ ప్రతిభ చూపి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గా నిలిచింది.

బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు పరుగులకే ఓపెనర్ సోఫియా డంక్లీ (1) వికెట్ కోల్పోయింది. లారా వోల్వార్ద్ట్ – హర్లీన్ డియోల్ రెండో వికెట్ కు 49 పరుగులు జత చేశారు. డియోల్ 33బంతుల్లో 4 ఫోర్లతో 31;  లారా 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 57 పరుగులు చేసి అవుట్ కాగా, గార్డ్ నర్ 33 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

జెస్ జోనాస్సేన్ 2; కాప్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ సాధించారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ 10వరుగుల వద్ద ఓపెనర్ షఫాలీ వర్మ(8) వికెట్ కోల్పోయింది. మారిజానే కాప్-36; అరుంధతి రెడ్డి-25; ఎలీస్ క్యాప్సీ-22; కెప్టెన్ మెగ్ లన్నింగ్ -18 పరుగులు చేశారు. జెమైమా రోడ్రిగ్యూస్-1; జెస్ జోనాస్సేన్-4; తానియా భాటియా- 1; రాధా యాదవ్-1; పూనమ్ యాదవ్ డకౌట్… లు విఫలమయ్యారు. మారిజాన్ కాప్ రనౌట్, 18వ ఓవర్లో అరుంధతి రెడ్డి ఔట్ కావడంతో మ్యాచ్ గుజరాత్ పైచేయి సాధించింది, 18.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

గుజరాత్ బౌలర్లలో కిమ్ గ్రాత్,  తనూజా కన్వర్, ఆష్లీ గార్డ్ నర్ తలా రెండు; స్నేహ్ రానా, హర్లీన్ డియోల్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్