లండన్ లోని ఓవల్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ టి సి) ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో ఇండియా బరిలోకి దిగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టి రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్ళ కోసారి ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఇది రెండో సీజన్ కావడం గమనార్హం. న్యూజిలాండ్- ఇండియా మధ్య జరిగిన 2019-21 సీజన్ లో జరిగిన డబ్ల్యూటిసి ఫైనల్ లో కివీస్ విజయం సాధించి ఈ ఫార్మాట్ పెట్టిన తరువాత తొలి విజేతగా అవతరించింది.
2021-23 సీజన్ కు ఇండియా-ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి. రెండేళ్ళ సీజన్ లో టెస్ట్ క్రికెట్ ఆడే జట్ల మధ్య జరిగే సిరీస్ ల ఆధారంగా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ల్లో తలపడతాయి.
ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రెహానే, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బొలాండ్